13 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు

ABN , First Publish Date - 2021-05-12T19:37:04+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాల్లో బలహీనంగా కనిపిస్తున్నా.. 13 రాష్ట్రాల్లో లక్షకు పైగా..

13 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాల్లో బలహీనంగా కనిపిస్తున్నా.. 13 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు నమోదు కావడం భయాందోళన కలిగిస్తోంది. ఆరు రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష వరకు యాక్టివ్ కేసులుండగా.. 17 రాష్ట్రాల్లో 50వేల కన్నా తక్కువ యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్‌వాల్ తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, హరియానా, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులున్నాయని, ఈ 13 రాష్ట్రాల జాబితాలో 5,93,150 యాక్టివ్ కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. 1,05,104 కేసులతో బీహార్ చివరి స్థానంలో ఉందన్నారు.


దాదాపు 26 రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు  15శాతానికిపైగా ఉందని, ఆరు రాష్ట్రాల్లో 50వేల నుంచి లక్ష వరకు యాక్టివ్ కేసులు, 17 రాష్ట్రాల్లో 50వేల కన్న తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని లవ్ అగర్వాల్ తెలిపారు.

Updated Date - 2021-05-12T19:37:04+05:30 IST