ఒక్కరోజులో 8 వేల పైనే..

ABN , First Publish Date - 2020-06-03T07:08:42+05:30 IST

దేశంలో కరోనా విజృంభణ తగ్గడం లేదు. మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 8,171 మంది వైరస్‌ బారిన పడ్డారు. 204 మంది ప్రాణాలు కోల్పోయారు...

ఒక్కరోజులో 8 వేల పైనే..

  • 204 మంది మృతి
  • దేశంలో తగ్గని కరోనా ఉధృతి


న్యూఢిల్లీ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా విజృంభణ తగ్గడం లేదు. మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 8,171 మంది వైరస్‌ బారిన పడ్డారు. 204 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 2,287 కేసులతో మహారాష్ట్రలో కేసులు 72 వేలు దాటాయి. తమిళనాడులో వరుసగా మూడో రోజూ వెయ్యి పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో చెన్నైవారే 809 మంది ఉన్నారు. కర్ణాటకలో రికార్డు స్థాయిలో 388 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో 80 శాతం మహారాష్ట్ర నుంచి వచ్చినవారు. ఢిల్లీలోనూ భారీగా 1,298 మంది వైరస్‌ బారినపడ్డారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ కార్యాలయంలోని 13 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. ఆస్పత్రుల్లో మంచాల అందుబాటును తెలిపే యాప్‌ను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. కేరళ మళప్పురంలో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకాలేక పోతున్న వ్యథతో 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టీవీ నటి, ఉత్తరాఖండ్‌ పర్యటక శాఖ మంత్రి కోడలు  మొహెనా కుమారి వైర్‌సకు గురయ్యారు.


Updated Date - 2020-06-03T07:08:42+05:30 IST