ప్రపంచవ్యాప్తంగా 67 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-05T17:44:06+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కరోనా పంజా విసురుతూనే ఉంది. దీంతో...

ప్రపంచవ్యాప్తంగా 67 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కరోనా పంజా విసురుతూనే ఉంది. దీంతో ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 65 లక్షలు దాటాయి. బ్రెజిల్‌వో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రష్యాలో కరోనా విజృంభిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 67,02,662 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,93,210 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 32,51,544 మంది కోలుకున్నారు. 


అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో గత 24 గంటల్లో మొత్తం 19,24,051 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,10,173 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 7,12,252 మంది కోలుకున్నారు. బ్రెజిల్‌లో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 6,15,870 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 34,039 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 2,74,997 మంది కోలుకున్నారు. అలాగే స్పెయిన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,87,740 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 27,133 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,07,015 మంది కోలుకున్నారు. రష్యాలో గత 24 గంటల్లో మొత్తం 4,41,108 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 5,384 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 2,04,623 మంది కోలుకున్నారు. 


ఇటలీలో కూడా కేసుల తీవ్రత పెరుగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 2,34,013 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 33,689 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,61,895 మంది కోలుకున్నారు. ఫ్రాన్స్‌లోచూస్తే గత 24 గంటల్లో మొత్తం 1,52,444 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 29,065 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 69,976 మంది కోలుకున్నారు. బ్రిటన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,81,661 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 39,904 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 30,255 మంది కోలుకున్నారు.

Updated Date - 2020-06-05T17:44:06+05:30 IST