50 ఏళ్లలో 4.58 కోట్ల మంది మహిళల మిస్సింగ్‌

ABN , First Publish Date - 2020-07-01T08:30:23+05:30 IST

భారత్‌లో గత 50 ఏళ్లలో 4.58 కోట్ల మంది మహిళలు గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రపంచ జనాభా- 2020పై ఐరాస జనాభా నిధి (యూఎన్‌ఎ్‌ఫపీఏ) మంగళవారం నివేదికను విడుదల చేసింది...

50 ఏళ్లలో 4.58 కోట్ల మంది మహిళల మిస్సింగ్‌

  • గణాంకాలు వెల్లడించిన ఐరాస 


ఐక్యరాజ్యసమితి, జూన్‌ 30: భారత్‌లో గత 50 ఏళ్లలో 4.58 కోట్ల మంది మహిళలు గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రపంచ జనాభా- 2020పై  ఐరాస జనాభా నిధి (యూఎన్‌ఎ్‌ఫపీఏ) మంగళవారం నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక మేరకు ప్రపంచవ్యాప్తంగా గత ఐదు దశాబ్దాల్లో 14.26 కోట్ల మంది మహిళలు కనిపించకుండా పోయారు. 1970 లెక్కల (6 కోట్ల మంది) ప్రకారం  అది ఇప్పుడు రెండింతలకు పైనే  చేరింది. ఆచూకీ లేకుండా పోతున్న మహిళల సంఖ్య జనాభా పరంగా తొలి రెండు స్థానాల్లో ఉన్న చైనా, భారత్‌లోనే భారీగా ఉంది.


చైనాలో 7.23 కోట్ల మంది మహిళలు గల్లంతయ్యారు. ఈ విషయంలో చైనాదే అగ్రస్థానం. 2013-17 మఽధ్య భారత్‌లో 4.6 లక్షల మంది బాలికలు గల్లంతయ్యారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు భారత్‌ అనుసరిస్తున్న తీరును ఐరాస శ్లాఘించింది. వ్యవసాయ, సాంకేతిక వినియోగం, పెట్టుబడి తదితర రంగాల్లో తన అనుభవాన్ని ప్రపంచ దేశాలతో భారత్‌ పంచుకుంటోందని పేర్కొంది. ఈ మేరకు పేదరిక నిర్మూలనపై సమాఖ్యను మంగళవారం లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఐరాస జనరల్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్‌ ముహమ్మద్‌-బందే వ్యాఖ్యానించారు. పేదరిక నిర్మూలనలో భారత్‌ విజయం అనేది ప్రపంచానికే విజయమని అని ముహమ్మద్‌- బందే  చెప్పారు.  


Updated Date - 2020-07-01T08:30:23+05:30 IST