400 మంది పార్లమెంటు సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్

ABN , First Publish Date - 2022-01-09T19:03:31+05:30 IST

పార్లమెంటు సిబ్బందిలో దాదాపు 400 మంది కోవిడ్-19కు గురయ్యారు

400 మంది పార్లమెంటు సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్

న్యూఢిల్లీ : పార్లమెంటు సిబ్బందిలో దాదాపు 400 మంది కోవిడ్-19కు గురయ్యారు. అధికార వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఆదివారం వెల్లడించిన సమాచారం ప్రకారం, పార్లమెంటులో పని చేస్తున్న 1,409 మందిలో 402 మందికి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధరణ అయింది. జనవరి 4 నుంచి 8 వరకు వీరు ఈ వ్యాధికి గురయ్యారు. వీరికి ఒమైక్రాన్ సోకిందేమో తెలుసుకునేందుకు వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. 


ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సిబ్బందికి అంతర్గత సందేశాలు జారీ అయ్యాయి. 200 మంది లోక్‌సభ సిబ్బందికి, 69 మంది రాజ్యసభ సిబ్బందికి, 133 మంది అనుబంధ సిబ్బందికి కోవిడ్-19 సోకినట్లు ఈ సందేశంలో తెలియజేశారు. కోవిడ్ సోకినవారితో పని చేసే సమయంలో కలిసిన సిబ్బందిని ఐసొలేషన్‌లో ఉంచారు. 


Updated Date - 2022-01-09T19:03:31+05:30 IST