న్యాక్‌తో 4.10 లక్షల మందికి శిక్షణ: వేముల

ABN , First Publish Date - 2020-09-25T08:47:23+05:30 IST

నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌) ద్వారా 4.10 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు...

న్యాక్‌తో 4.10 లక్షల మందికి శిక్షణ: వేముల

హైదరాబాద్‌, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌) ద్వారా 4.10 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 15 వేల మంది భవన కార్మికులకు న్యాక్‌ కేంద్రాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించామని, ఇప్పటికే సీఎస్‌ నుంచి అనుమతి తీసుకున్నామని వెల్లడించారు. న్యాక్‌ 22వ ఆవిర్భావ దినం సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి గురువారం ఆన్‌లైన్‌లో అధికారులతో సమావేశమయ్యారు. నిపుణులైన కార్మికులను తయారు చేయడంలో న్యాక్‌ కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు. న్యాక్‌ జిల్లా సెంటర్లలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్‌ అనుమతి ఇచ్చారని తెలిపారు. 


Updated Date - 2020-09-25T08:47:23+05:30 IST