దేశ వ్యాప్తంగా 3.29 లక్షల మందికి కరోనా

ABN , First Publish Date - 2021-05-11T16:04:49+05:30 IST

ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 3,29,942 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దేశ వ్యాప్తంగా 3.29 లక్షల మందికి కరోనా

ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 3,29,942 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దేశ వ్యాప్తంగా కొత్తగా.. 3,876 మంది కరోనాతో మృతి చెందారు. కాగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,90,27,304 ఉండగా.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 37,15,221గా ఉంది. కాగా.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 2,49,992 మంది కరోనాతో మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 30,56,00,187 కోవిడ్ పరీక్షలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించింది. గడిచిన 24 గంటల్లో 18,50,110 కోవిడ్ టెస్టులను ఐసీఎంఆర్ నిర్వహించింది. కాగా.. ఇప్పటి వరకూ కొవిడ్ టీకాను 17,27,10,066 మందికి ఇచ్చినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Updated Date - 2021-05-11T16:04:49+05:30 IST