రాజధానిలో నెల్లాళ్లలో 21 వేలకుపైగా పెరిగిన కరోనా యాక్టివ్ కేసులు

ABN , First Publish Date - 2020-09-20T11:53:34+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో నెలరోజుల వ్యవధిలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 21 వేలు దాటింది. ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇది ఢిల్లీ సర్కారును బెంబేలెత్తిస్తోంది. ఢిల్లీ ఆరోగ్యశాఖ అందించిన వివరాల...

రాజధానిలో నెల్లాళ్లలో 21 వేలకుపైగా పెరిగిన కరోనా యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో నెలరోజుల వ్యవధిలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 21 వేలు దాటింది. ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇది ఢిల్లీ సర్కారును బెంబేలెత్తిస్తోంది. ఢిల్లీ ఆరోగ్యశాఖ అందించిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఢిల్లీలో 32,250 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆగస్టు 18న ఈ సంఖ్య 11,068గా ఉంది. నెల్లాళ్ల వ్యవధిలలో ఇది 21 వేలు దాటింది. ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. జూన్ 28 నాటికి ఈ సంఖ్య 29 వేలకు చేరుకుంది.


తరువాత యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ, ఆగస్టు 4 నాటికి ఈ సంఖ్య 10 వేలకు దిగువకు చేరింది. దీంతో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గుతుందని వైద్యాధికారులు భావిస్తూవచ్చారు. అయితే ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయి. రాజధానిలో యాక్టివ్ కేసుల సంఖ్య 21 వేలు దాటడం ఇదే తొలిసారి. యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బాధితులకు అవసరమైన బెడ్లు ఏర్పాటు చేయాల్సివస్తోంది. దీనికితోడు హోమ్ఐసోలేషన్‌లో ఉంటున్నవారి సంఖ్య 50 శాతం పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుండటంతో దీనిని కరోనా సెకెండ్ వేవ్‌గా భావిస్తున్నారు. అయితే వైద్య నిపుణులు ఈ వాదనను ఖండిస్తున్నారు

Updated Date - 2020-09-20T11:53:34+05:30 IST