ఒకే యూనివర్శిటీలోని 1200కు పైగా విద్యార్థులకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-08-30T05:18:25+05:30 IST

అమెరికాను కరోనా మహమ్మారి ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు.

ఒకే యూనివర్శిటీలోని 1200కు పైగా విద్యార్థులకు కరోనా పాజిటివ్

న్యూయార్క్: అమెరికాను కరోనా మహమ్మారి ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. అమెరికా వ్యాప్తంగా అనేక స్కూళ్లు, యూనివర్శిటీలు పూర్తిగా తెరుచుకోవడంతో విద్యార్థులు తిరిగి తరగతులకు హాజరవుతున్నారు. ఇదే సమయంలో కరోనా కేసులు విపరీతంగా వెలుగుచూస్తున్నాయి. అమెరికాలోని అనేక యూనివర్శిటీల్లో భారీగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు యూనివర్శిటీ ఆఫ్ అలబామాలోని 1200కు పైగా విద్యార్థులకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఆగస్టు 19 నుంచి క్లాసులు మొదలుకావడంతో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నట్టు చెబుతున్నారు. గత నాలుగు రోజుల్లోనే యూనివర్శిటీలో 481 కరోనా కేసులు నమోదైనట్టు లెక్కలు చెబుతున్నాయి. మరోపక్క స్కూలుకు హాజరవుతున్న విద్యార్థులు కూడా ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.

Updated Date - 2020-08-30T05:18:25+05:30 IST