11 రాష్ట్రాల్లో 1 లక్షకు పైగా యాక్టివ్ కేసులు

ABN , First Publish Date - 2021-05-16T00:32:02+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజూ లక్షల కేసులు నమోదువుతున్నాయి. వేల మంది మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే ..

11 రాష్ట్రాల్లో 1 లక్షకు పైగా యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజూ లక్షల కేసులు నమోదువుతున్నాయి. వేల మంది మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో 1 లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. అలాగే 8 రాష్ట్రాల్లో 50,000 నుంచి 1 లక్ష వరకు యాక్టివ్ కేసులున్నాయని, 17 రాష్ట్రాల్లో 50,000 కన్నా తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఇక అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న రాష్టాలలో మొదటి రాష్టం మహారాష్ట్ర, యూపీ, గుజరాత్ & చత్తీస్ఘడ్, పలు రాష్టాలు ఉన్నట్లు వెల్లడించారు. కాగా.. తమిళనాడులో ఓ వారం నుంచి అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని లవ్ అగర్వాల్ వెల్లడించారు.


Updated Date - 2021-05-16T00:32:02+05:30 IST