Abn logo
Apr 10 2020 @ 00:31AM

మరిన్ని ఆంక్షలు అమలు

రాపూరు, ఏప్రిల్‌ 9: రాపూరులో లాక్‌డౌన్‌ ఆంక్షలు మరిన్ని అమలవుతున్నాయి. గతంలో మార్కెట్‌లో దుకాణాలకు ఉదయం 9గంటల వరకూ పోలీసులు అనుమతి ఇచ్చారు. గురువారం అనూహ్యంగా కిరణాకొట్టులకు మాత్రమే అనుమతి ఇచ్చి మిగతా వాటిని మూయించారు. దీంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాన్సీ దుకాణాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలను తప్ప మిగిలిన దుకాణాలకు పర్మిషన్‌ ఇవ్వబోమని పోలీసులు తేల్చిచెప్పారు.  రోడ్ల మీదున్న జనాన్ని ఇళ్లలోకి తరిమేశారు.


Advertisement
Advertisement
Advertisement