అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మరింత పౌష్టికాహారం

ABN , First Publish Date - 2021-07-27T04:58:54+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాలద్వారా లబ్ధిదారులకు మరింత పౌష్టిక ఆహా రం అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలె క్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మరింత పౌష్టికాహారం
సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు భూమి పూజ చేస్తున్న జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తదితరులు

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 26: అంగన్‌వాడీ కేంద్రాలద్వారా లబ్ధిదారులకు మరింత పౌష్టిక ఆహా రం అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలె క్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో అంగన్‌వాడీలలో చిరుధాన్యాల వంట పదార్థాలు అందజేయడంపై వారం రోజులు కొనసాగే శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ అంగన్‌వాడీకేంద్రాల్లో చిరుధాన్యాలతో పదార్థాలుచేసి లబ్ధిదారులకు అందజేయడానికి ప్రభు త్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు కింద ఆసిఫాబాద్‌లో మూడు, రెబ్బెనలో రెండుకేంద్రాలు ఏర్పాటు చేశామ న్నారు. ఈ కేంద్రాల్లో వారంరోజుల పాటు చిరుధాన్యా లతో ఆహార పదార్థాలు తయారు చేసి గర్భిణులకు, పిల్లలకు ఏ విధంగా అందజేయాలనే విషయంపై శిక్షణ నిర్వహిస్తామన్నారు. తరువాతజిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, జిల్లామహిళా శిశుసంక్షే మశాఖాధికారి సావిత్రి, డీఎంహెచ్‌వో మనోహర్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఇన్‌చార్జిపీడీ రవికృష్ణ పాల్గొన్నారు.

సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు భూమిపూజ..

కాగజ్‌నగర్‌: పట్టణంలో రాజీవ్‌గాంధీ చౌరస్తా నుంచి ఎన్టీఆర్‌ చౌరస్తా వరకు నిర్మించే సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు కలెక్టర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పనులు త్వరితగ తిన పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాంహుస్సేన్‌, వైస్‌చైర్మన్‌ గిరీష్‌ కుమార్‌, కాసం శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, కమిషనర్‌ సీవీఎన్‌రాజు పాల్గొన్నారు.

పోస్టర్ల ఆవిష్కరణ..

ఆసిఫాబాద్‌ రూరల్‌: ఇంటింటా ఇన్నోవేటర్‌ ప్రద ర్శనకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లా డుతూ ప్రదర్శనలు పంపడానికి గడువును ఆగస్టు10 వరకు పొడిగించినట్లు తెలిపారు. ప్రదర్శనలను 91006785435కి పంపించాలన్నారు. పూర్తి వివరా లకు జిల్లాసైన్స్‌ అధికారి కటకం మధుకర్‌ (9441140434)ను సంప్రదించాలన్నారు.

Updated Date - 2021-07-27T04:58:54+05:30 IST