‘డిజేబుల్‌’లో మరిన్ని ఫీచర్లు

ABN , First Publish Date - 2022-05-14T08:37:31+05:30 IST

వాట్సాప్‌లో మెసేజెస్‌ డిజెపియరింగ్‌ ఫీచర్‌ మనకు పరిచయమే. అయితే ఇదే విషయంలో మరింత ముందుకు వెళ్ళేందుకు కొత్త ఫీచర్‌పై వాట్సాప్‌

‘డిజేబుల్‌’లో మరిన్ని ఫీచర్లు

వాట్సాప్‌లో మెసేజెస్‌ డిజెపియరింగ్‌ ఫీచర్‌ మనకు పరిచయమే. అయితే ఇదే విషయంలో మరింత ముందుకు వెళ్ళేందుకు కొత్త ఫీచర్‌పై వాట్సాప్‌ పనిచేస్తున్నట్టు సమాచారం. మల్టిపుల్‌ చాట్స్‌ ఒకేసారి అదృశ్యం కావడం ఈ కొత్త ఫీచర్‌ లక్షణం. డబ్ల్యూఎబేటాఇన్ఫో ప్రకారం ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. 2.22.11.11 వెర్షన్‌లో ఈ అప్‌డేట్‌ వస్తోంది. 


ముందే పేర్కొన్నట్టు గత ఏడాదే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఏడు రోజుల తరవాత ఆటోమేటిక్‌గా మెసేజెస్‌ తొలగిపోతాయి. తరవాత 90 రోజులు, 24 గంటల ఆప్షన్స్‌ను కూడా ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఈ ఫీచర్‌ ఎనేబుల్‌ చేసుకున్న పక్షంలో కొత్త మెసేజ్‌లకు మాత్రమే ‘అదృశ్యం’ ఫీచర్‌ వర్తిస్తుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్‌ చాట్స్‌పై వాట్సాప్‌ పనిచేస్తోంది. బైటపడిన స్ర్కీన్‌షాట్‌ ప్రకారం కొత్త షార్ట్‌కట్స్‌తో పలు చాట్స్‌ను ఒకేసారి సెలెక్ట్‌ చేసినప్పుడు కూడా కనిపిస్తుంది. ఈ ఫీచర్‌తో ప్రతి చాట్‌లో మాన్యువల్‌గా టోగెల్‌ చేయాల్సిన అవసరం ఉండదు.


అయితే ఫీచర్‌ ఇంకా ఆరంభ దశలోనే ఉంది. అందువల్ల ఎప్పుడు ఇది అందుబాటులోకి వస్తుందన్నది తెలియదు. మరో కొత్త ఫీచర్‌ ‘కంపానియన్‌ మోడ్‌’పై కూడా వాట్సాప్‌ పనిచేస్తోంది. దీంతో ప్రైమరీ స్మార్ట్‌ఫోన్‌ లేదంటే మరొక ఫోన్‌తో వాట్సాప్‌ని లింక్‌ చేసుకోవచ్చు. కంపానియన్‌ మోడ్‌కు వెళ్ళిన తరవాత ప్రైమరీ ఫోన్‌లో లాగౌట్‌ అయ్యే సదుపాయం ఉంటుంది. ఇది కూడా డెవలప్‌మెంట్‌ దశలోనే ఉంది. 

Read more