స్టడీ సర్కిల్ రికార్డులు పరిశీలిస్తున్న మంత్రి
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున
విశాఖపట్నం, జూలై 3: రుషికొండలోని అంబేడ్కర్ స్టడీ సర్కిల్ భవనంలో విద్యార్థులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఆదివారం ఆయన స్టడీసర్కిల్ భవనంలో విద్యార్థులకు అందుతున్న సేవలు వంటగది, ఇతర సదుపాయాలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీల భవిష్యత్తు కోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, అంబేడ్కర్ ఆశయాలు నెరవేరుస్తున్నారని చెప్పారు. సంక్షేమ రాజ్యాన్ని చూసి విపక్షాలు జీర్ణించుకోలేక చౌకబారు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఆయన వెంట పలువురు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఉన్నారు.