Abn logo
Jun 30 2020 @ 18:57PM

ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్న ఇద్దరు మంత్రులు

అమరావతి: రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ ఎమ్మెల్సీ పదవులకు బుధవారం రాజీనామా చేయనున్నారు. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాతో గవర్నర్ ఆమోదం మేరకు మంత్రుల పోర్ట్ పోలీయోలు సీజ్ కానున్నాయి. కాగా, ఈనెల 19వ తేదీన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అధికారికంగా ప్రమాణం చేయకపోయినా రాజ్యసభ సభ్యులుగా వారి పదవీకాలం మొదలైంది. ఈ మేరకు ఇరువురికి రాజ్యసభ చైర్మన్ కార్యాలయం సమాచారం పంపింది. కాగా, పార్లమెంట్ సమావేశం కాగానే రాజ్యసభలో సభ్యులుగా వీరిద్దరూ ప్రమాణం చేయనున్నారు. 

Advertisement
Advertisement
Advertisement