పెసరపప్పు పాయసం

ABN , First Publish Date - 2020-06-08T05:38:19+05:30 IST

కడాయిలో నెయ్యి వేసి వేడయ్యాక ఎండుద్రాక్ష, బాదంపప్పులు వేసి బంగారం రంగు వచ్చేదాకా వేగించి పక్కనపెట్టుకోవాలి. అదే కడాయిలో పెసరపప్పు వేసుకొని లేత గోధుమరంగులోకి మారేదాకా వేగించి, తరువాత కుక్కర్‌లో పోసి మెత్తగా ఉడికించి పక్కనపెట్టాలి...

పెసరపప్పు పాయసం

కావలసినవి:

పాలు - ఒకటిన్నర లీటరు

పెసరపప్పు - ముప్పావు కప్పు

బెల్లం తురుము - ముప్పావు కప్పు

దాల్చిన చెక్క పౌడర్‌ - అర టేబుల్‌ స్పూను

బాదం పప్పులు - 2 టేబుల్‌ స్పూన్లు

ఎండు ద్రాక్ష - 2 టేబుల్‌ స్పూన్లు

నెయ్యి - టేబుల్‌ స్పూను 


తయారీ: కడాయిలో నెయ్యి వేసి వేడయ్యాక ఎండుద్రాక్ష, బాదంపప్పులు వేసి బంగారం రంగు వచ్చేదాకా వేగించి పక్కనపెట్టుకోవాలి. అదే కడాయిలో పెసరపప్పు వేసుకొని లేత గోధుమరంగులోకి మారేదాకా వేగించి, తరువాత కుక్కర్‌లో పోసి మెత్తగా ఉడికించి పక్కనపెట్టాలి. మరో పాత్రలో నీళ్లు, బెల్లం తురుము వేసి బెల్లం కరిగేదాకా మరిగించాలి. కొంచెం పెద్ద పాత్రలో పాలు పోసి బాగా మరిగించాలి. ఉడికించిన పెసరపప్పును వేడి పాలలో వేసి కలియబెట్టాలి. ఇప్పుడు బెల్లం పాకం పోసి కలియతిప్పుతూ చిన్నమంట మీద 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఆఖరులో దాల్చిన చెక్క పొడి, బాదం పప్పు వేసి కలపాలి. అంతే నోరూరించే పెసరపప్పు పాయసం రెడీ. వేడివేడిగా తిన్నా, ఫ్రిజ్‌లో పెట్టి చల్లారాక తిన్నా.. ఎలా తిన్నా రుచి బావుంటుంది.

Updated Date - 2020-06-08T05:38:19+05:30 IST