మూంగ్‌ దాల్‌ ఛాట్‌

కావలసినవి: పెసరపప్పు - అరకప్పు, క్యారెట్‌ తురుము - అరకప్పు, దానిమ్మ గింజలు - అరకప్పు, ఉల్లిపాయలు తరిగినవి - అరకప్పు, పుదీనా - ఒకకట్ట, కొత్తిమీర - ఒకకట్ట, పచ్చిమిర్చి - రెండు, ఛాట్‌ మసాలా - ఒక టీస్పూన్‌, నిమ్మరసం - నాలుగు టీస్పూన్లు. 


తయారీ విధానం: పెసరపప్పును శుభ్రంగా కడిగి మూడు కప్పుల నీళ్లు పోసి, కాస్త ఉప్పు వేసి చిన్న మంటపై ఉడికించుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కాస్త ఉడికిన తరువాత నీళ్లను వంపేసి పప్పును ఒక పాత్రలోకి తీసుకోవాలి. అందులో క్యారెట్‌ తురుము, దానిమ్మ గింజలు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఛాట్‌ మసాలా, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. సాయంత్రం వేళ స్నాక్స్‌గా ఈ ఛాట్‌ బాగుంటుంది.భాంగ్‌ పకోడిఓట్స్‌ ఇడ్లీఆపంపోహా కట్‌లెట్స్‌రైస్‌ బాల్స్‌భేన్‌ కి కబాబ్‌ సాబుదానా కబాబ్‌దహీ కబాబ్‌క్యాబేజీ పకోడివిటమిన్‌ ఇడ్లీ
Advertisement
Advertisement