మూల్‌ నివాసి గుర్తింపు హర్షణీయం

ABN , First Publish Date - 2022-08-10T06:24:59+05:30 IST

దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు తమ కుల గుర్తింపును కాదని తామంతా మూల్‌ నివాసుల మనే గుర్తింపును సొంతం చేసుకోవడం హర్షణీయమని మూల్‌నివాసి సంఘ్‌ జాతీయ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు అన్నారు.

మూల్‌ నివాసి గుర్తింపు హర్షణీయం

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 9: దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు తమ కుల గుర్తింపును కాదని తామంతా మూల్‌ నివాసుల మనే గుర్తింపును సొంతం చేసుకోవడం హర్షణీయమని మూల్‌నివాసి సంఘ్‌ జాతీయ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు అన్నారు. ప్రపంచ మూల్‌ నివాసి దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం ఎలక్ర్టీకల్‌ శాఖ కల్యాణ మండపంలో మంగళవారం జరిగిన సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. మన పూర్వీకులు జ్యోతిరావు పూలే నుంచి బీఆర్‌ అంబేడ్కర్‌ వరకు కుల గుర్తింపు అనేది మన గుర్తింపు కాదని మూల్‌ నివాసి అనేది అందరు గుర్తించాలని చెప్పారని, ఈ విషయాన్ని ఆయా వర్గాలు గుర్తించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మూల్‌నివాసి కర్మచారీ కల్యాణి మహాసంఘ్‌ అధ్యక్షుడు కె.తిలక్‌కుమార్‌ మాట్లాడుతూ మూల్‌ నివాసీ గుర్తింపును సొంతం చేసుకోవడం ద్వారా ఐక్యమత్యం చెంది ఈ దేశంలో అన్ని రంగాల్లో తమ వాటాను సాధించుకోగలగుతారని చెప్పారు. విధ్యుత్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు కృష్ణా నాయక్‌ మాట్లాడుతూ దేశంలో 70శాతం ఆదివాసీలు దుర్బర పరిస్థితుల్లో ఉన్నారని వీరు అంబేడ్కరిజాన్ని సొంతం చేసుకోవడం ద్వారా చైతన్యం పొంది అభివృద్ధి చెందాలన్నారు. సమావేశంలో జి.శ్రీను, వి.భాస్కరరాజు, ఐ.రాంబాబు, రాయుడు శ్రీనివాస్‌, డా క్టర్‌ కోమల, డాక్టర్‌ కె.సూర్యకుమారి, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T06:24:59+05:30 IST