నెలలు లేదంటే సంవత్సరాలు: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై నాటో చీఫ్

ABN , First Publish Date - 2022-04-07T03:25:16+05:30 IST

రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ నుంచి యుద్ధం ఆపే సంకేతాలు ఏవీ అందలేని, బహుశా అందుకు ఆయన సిద్ధంగా లేరని స్పష్టమవుతోందని అన్నారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే వరకు పుతిన్ దండయాత్ర కొనసాగుతూనే ఉంటుందని జెన్స్ అన్నారు. యుద్ధం ప్రారంభమై..

నెలలు లేదంటే సంవత్సరాలు: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై నాటో చీఫ్

బ్రస్సెల్స్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదని అది నెలలపాటు లేదంటే సంవత్సరాల పాటు జరగొచ్చని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టన్‌బర్గ్ బుధవారం అన్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ నుంచి యుద్ధం ఆపే సంకేతాలు ఏవీ అందలేని, బహుశా అందుకు ఆయన సిద్ధంగా లేరని స్పష్టమవుతోందని అన్నారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే వరకు పుతిన్ దండయాత్ర కొనసాగుతూనే ఉంటుందని జెన్స్ అన్నారు. యుద్ధం ప్రారంభమై నెల రోజులకు ఎక్కువైంది. వందల సంఖ్యలో ఇరు దేశాల సైనికులు మరణిస్తున్నారు. ఉక్రెయిన్‌లో అనేక మంది పౌరులు సైతం మరణిస్తున్నారు. ఉక్రెయిన్‌లోని భవనాలు, పట్టణాలు క్రమంగా నేలమట్టం అవుతున్నాయి. ఆర్థికంగా కూడా ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోతోంది.


కాగా, ఉక్రెయిన్‌లో పౌరుల మరణాలను అమానుష ఘటనగా భావిస్తూ రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా, యూరప్ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్యా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆంక్షల్ని, విమర్శల్ని ఎదుర్కుంటోంది. తమ దేశ పౌరులను అకారణంగా పొట్టన పెట్టుకుంటున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఉక్రెయిన్‌పై పౌరులను ఎవరినీ చంపలేదని రష్యా చెబుతోంది. తమ పోరాటం ఉక్రెయిన్‌ సేనలతో జరుగుతోందని చెప్పుకొస్తుంది.

Updated Date - 2022-04-07T03:25:16+05:30 IST