నెలాఖరుకు రాష్ట్రంలో రోజూ లక్ష దాకా Covid కేసులు

ABN , First Publish Date - 2022-01-22T17:09:38+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల పరంపర మరిన్ని రోజులు దూసుకుపోనుందని నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలివారానికి ఏకంగా రోజూ లక్షమందికి కొవిడ్‌ పాజిటివ్‌ ప్రబలే అవకాశం ఉందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌

నెలాఖరుకు రాష్ట్రంలో రోజూ లక్ష దాకా Covid కేసులు

 బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల పరంపర మరిన్ని రోజులు దూసుకుపోనుందని నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలివారానికి ఏకంగా రోజూ లక్షమందికి కొవిడ్‌ పాజిటివ్‌ ప్రబలే అవకాశం ఉందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ ప్రకటించారు. కొవిడ్‌ నిబంధనలపై ముఖ్యమంత్రి బొమ్మై సమీక్షకు వెళ్లే ముందు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం రాష్ట్రంలో త్వరలోనే రోజూ లక్షమందికి పాజిటివ్‌ ప్రబలనుందన్నారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. రెండు విడతలతో పోల్చితే థర్డ్‌వేవ్‌ పెను ప్రభావం చూపలేదన్నారు. కేసులు పెరిగాయని, అయితే వ్యాక్సినేషన్‌ వల్ల ప్రాణనష్టం తప్పిందన్నారు. అయినా నిర్లక్ష్యం చేయరాదన్నారు. కొవిడ్‌ సోకితే పలు పరిణామాలు ఉంటాయని, ముందుజాగ్రత్తలు పాటించాల్సిందే అన్నారు.

Updated Date - 2022-01-22T17:09:38+05:30 IST