బెంగళూరు: కొవిడ్ నియంత్రణ కోసం రాజధాని బెంగళూరులో అమలు చేస్తున్న 144 సెక్షన్‌ను ఈ నెల 31 వరకు విస్తరించారు. కరోనా బారిన పడి హోం క్వారంటైన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న నగర పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిషేధాజ్ఞల సమయంలో సభలు సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి ఉండదు. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలో హెచ్చరించారు. ఇలాంటి వారిపై అంటువ్యాధుల నియంత్రణా చట్టం, విపత్తు నిర్వహణా చట్టాల కింద కేసులు దాఖలు చేస్తారు. కాగా వివాహాలు ఔట్‌డోర్‌లో అయితే 200 మందికి, ఇండోర్‌లో అయితే 100 మందికి పరిమితం చేశారు. ఇందుకు బీబీఎంపీ నుంచి ముందస్తుగా అనుమతి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు నైట్ కర్ఫ్యూ కూడా కొనసాగనుంది. రాత్రి 10 గంటల నుంచి వేకువజామున 5 గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని వెల్లడించారు. కాగా కొవిడ్ బారిన పడిన నగర పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ కోలుకుంటున్నారని అయితే ముందు జాగ్రత్తగా ఆ యన ఇంకా హోం క్వారంటైన్‌లోనే ఉన్నారని అక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం పేర్కొంది.
ఇవి కూడా చదవండి