వానాకాలం సన్నాలు పండించాలి

ABN , First Publish Date - 2021-06-17T06:09:15+05:30 IST

ప్రస్తుత వానాకాలంలో రైతులు వరిలో సన్నరకాలు పండించాలని సన్నరకాలకు అంతర్జాతీయ, జాతీయ మార్కెట్‌లలో మంచి డిమాండ్‌ ఉందని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేశవులు అన్నారు. బుధవారం డిచ్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంని సం

వానాకాలం సన్నాలు పండించాలి
డిచ్‌పల్లిలో విత్తన సంచులను పరిశీలిస్తున్న ఎండీ కేశవులు

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేశవులు 

డిచ్‌పల్లి పీఏసీఎస్‌ సందర్శన

డిచ్‌పల్లి, జూన్‌ 16: ప్రస్తుత వానాకాలంలో రైతులు వరిలో సన్నరకాలు పండించాలని సన్నరకాలకు అంతర్జాతీయ, జాతీయ మార్కెట్‌లలో మంచి డిమాండ్‌ ఉందని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేశవులు అన్నారు. బుధవారం డిచ్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంని సందర్శించిన ఆయన తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ తయారుచేసిన విత్తనాలను జేడీఏ గోవింద్‌తో కలిసి పరిశీలించి డిచ్‌పల్లి సహకార సంఘంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎండీ మా ట్లాడుతూ విత్తనాభివృద్ధి సంస్థ రైతంగానికి మేలురకం విత్తనాలను సరఫరా చేస్తుందని అధునాతన పద్ధతిలో రెండుసార్లు విత్తనాలను శుభ్రపరచి నాణ్యమైన విత్తనాలను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులందరూ విత్తనాభివృద్ధి సంస్థ అంద జేస్తున్న నాణ్యమైన విత్తనాలను సాగుచేసుకుని అధిక పంట దిగుబడులను పొందాలన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా మనగ్రోమోర్‌ విక్రయదారులకు ప్రభుత్వ ఆదేశానుసారం సన్నాల సాగుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇందుకు వ్యవసాయ అధికారులు కూడా రైతంగానికి అవగాహన కలిగించాలన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో కల్తీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీం లను ఏర్పాటు చేశామన్నారు. సన్నా రకాల వరిసాగుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు రైతులు సహకరించాలని రాష్ట్రంలో వసతి గృహాలకు సన్నరకం బియ్యాన్ని ప్రభు త్వం సరఫరా చేస్తుందన్నారు. వానకాలంలో గిట్టుబాటు ధరల కోసం సన్నరకం వరిని సాగుచేసుకుని అధిక పంట దిగుబడులు పొందాలన్నారు. సీఎం కేసీఆర్‌, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిలు రైతంగానికి నాణ్యత ప్రమాణాలకు ఆధారంగా విత్తనాలను సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే రైతులు సాగు చేయాలని ఆయన పేర్కొన్నారు. జేడీఏ గోవింద్‌ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని విత్తనాలు కొనుగోలు చేసిన చోట రసీదు పొందాలని రైతులకు సూచించారు. జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ టీంలు, పోలీసులు వ్యవసాయ అధికారులతో నకిలీ విత్తనాల నివారణ కోసం పకడ్బందీ చర్యలు చేపట్టామన్నా రు.  ఈ సందర్భంగా మేనేజింగ్‌ డైరెక్టర్‌ విత్తనాల గోదాం లో విత్తనాలను పరిశీలించారు. డిచ్‌పల్లి సహకార కేంద్రం వద్ద వరి ధాన్యం నూర్పిడి యంత్రాన్ని ఆయన పరిశీలించి వివరాలను చైర్మన్‌ గడవాడ జైపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎండీ కేశవులు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎం విష్ణువర్ధన్‌రెడ్డి, చైర్మన్‌ జైపాల్‌, సీఈవో కిషన్‌, డైరెక్టర్‌ సతీష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సీడ్‌పై రైతులకు అవగాహన

మోపాల్‌: సీడ్‌పై రైతులకు తెలంగాణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కేశవులు అవగాహన కల్పించారు. బుధవారం మండలంలోని బాడ్సీ ప్రాథమిక సహకార సంఘాన్ని సందర్శించి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సీడ్‌పై అవగాహన కల్పించేందుకే తాము సొసైటీలను సందర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్‌, రీజనల్‌ మేనేజర్‌ విష్ణువర్ధన్‌, చైర్మన్‌ మోహన్‌రెడ్డి, కార్యదర్శి నర్సయ్య, పాలకవర్గం సభ్యులు ఉన్నారు.

Updated Date - 2021-06-17T06:09:15+05:30 IST