Monsoon Session: 9 రోజుల్లో 8 గంటలే రాజ్య సభ సద్వనియోగం... 33 గంటలు గందరగోళం!

ABN , First Publish Date - 2021-07-31T13:15:56+05:30 IST

గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో...

Monsoon Session: 9 రోజుల్లో 8 గంటలే రాజ్య సభ సద్వనియోగం... 33 గంటలు గందరగోళం!

న్యూఢిల్లీ: గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో 8.2 గంటలు మాత్రమే సభ కొనసాగింది. పెగాసస్‌పై చర్చ చేపట్టాలన్న విపక్షాల ఆందోళనలతో 33.8 గంటల సమయం వృథా అయ్యింది. సభలో చోటుచేసుకున్న హంగామా కారణంగా శుక్రవారం నాటి సభ కూడా సోమవారానికి వాయిదా పడింది. సభాపతి ఎంతగా ప్రయత్నించినప్పటికీ గడచిన రెండురోజుల్లో సభలో ప్రశ్నాసమయం, జీరో అవర్‌ గందరగోళం మధ్యనే ప్రారంభం అయ్యాయి. ఇదే సమయంలో ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. ఎగువ సభలో ఇప్పటి వరకూ కేవలం కరోనా వ్యాప్తిపైనే చర్చజరిగింది. 

Updated Date - 2021-07-31T13:15:56+05:30 IST