Abn logo
Jun 14 2021 @ 09:41AM

21 ఏళ్ల త‌రువాత స‌మ‌యానిక‌న్నా ముందుగానే హిమాచ‌ల్‌కు రుతుప‌వ‌నాలు

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు హిమాచల్ ప్రదేశ్‌ని తాకాయి. 21 సంవత్సరాల తరువాత రాష్ట్రానికి ముందుగానే రుతుపవనాలు చేరుకున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత ఏడాది రుతుపవనాలు జూన్ 24 న రాష్ట్రానికి చేరుకున్నాయి. ఈ రోజు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్త‌రు వర్షాలు కురుస్తాయని, కొండ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. ఇదిలావుండ‌గా రాబోయే రెండు రోజుల్లో ముంబై, థానేలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. రాయ్‌గడ్‌లోని రత్నగిరి పరిసరాల్లో బలమైన గాలులతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ హెచ్చరికల‌ను దృష్టిలో ఉంచుకుని, బీఎంసీకి చెందిన విపత్తు నిర్వహణ విభాగం సహాయక చర్య‌లు చేప‌ట్టేందుకు స‌న్నాహాలు చేసింది.