ఈ ఊరి ఇళ్ళు ఎంతో ప్రత్యేకం!

ABN , First Publish Date - 2020-11-17T05:30:00+05:30 IST

పెద్దపెద్ద బండరాళ్లను తొలగించి, కొండలను పిండిచేసి భవనాలు నిర్మించడం చూసే ఉంటారు. కానీ ఆ ఊరిలో మాత్రం రాళ్లను అలానే ఉంచి ఇళ్లు నిర్మించుకుంటారు...

ఈ ఊరి ఇళ్ళు ఎంతో ప్రత్యేకం!

పెద్దపెద్ద బండరాళ్లను తొలగించి, కొండలను పిండిచేసి భవనాలు నిర్మించడం చూసే ఉంటారు. కానీ ఆ ఊరిలో మాత్రం రాళ్లను అలానే ఉంచి ఇళ్లు నిర్మించుకుంటారు. అవసరమైతే రాళ్లను ఇళ్లుగా మలుచుకుంటారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందో తెలుసా?


  1. పోర్చుగల్‌లో మోన్సాంటో అనేది ఓ చిన్న ఊరు. ఈ గ్రామంలో ఇళ్లన్నీ కొండ రాళ్ల మధ్య అందంగా కనిపిస్తాయి. 
  2. ఈ ఊరు ప్రత్యేకత ఏమిటంటే పెద్ద పెద్ద రాళ్లను కదపకుండానే ఇళ్లు నిర్మించుకున్నారు. వాటిని ధ్వంసం చేయకుండానే ఇంటికి అవసరమైన గదులను ఏర్పాటు చేసుకున్నారు. 
  3. ఒకరిద్దరు కాదు, గ్రామస్థులందరూ అదే అదే పద్ధతి ఎంచుకున్నారు. రాళ్ల మధ్య రమణీయంగా ఉన్న ఆ ఊరు పర్యాటకులతో సందడిగా ఉంటుంది.  

Updated Date - 2020-11-17T05:30:00+05:30 IST