monkeypox prevention: మంకీపాక్స్ వ్యాధికి తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు.

ABN , First Publish Date - 2022-08-03T18:04:22+05:30 IST

మంకీపాక్స్ 'మంకీపాక్స్ వైరస్' వల్ల వస్తుంది. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ప్రమాదం కూడా ఉంది.

monkeypox prevention: మంకీపాక్స్ వ్యాధికి తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు.

మంకీపాక్స్ అనేది స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందినదే..సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, మంకీపాక్స్ 'మంకీపాక్స్ వైరస్' వల్ల వస్తుంది. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ప్రమాదం కూడా ఉంది.


ప్రపంచ దేశాలను వణికిస్తోన్న మంకీపాక్స్‌ వ్యాధి లక్షణాలు తీవ్రమైన దద్దుర్లు, చర్మ ఇబ్బందులతో ఉంటుంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. 68 దేశాలలో 16,593 కేసులు నమోదు కాగా మన దేశంలో నాలుగు మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలో మూడు, ఢిల్లీలో ఒక మంకీపాక్స్‌ కేసును గుర్తించారు. 

 

మంకీపాక్స్: వైరల్ వ్యాధికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేయవలసినవి., చేయకూడని పనుల జాబితాను విడుదల చేసింది. 


చేయవలసినవి: 

1. ఈ వ్యాధి సోకిన వ్యక్తిని ఇతరుల నుండి వేరుచేయండి, తద్వారా వ్యాధి వ్యాప్తి చెందదు.


2. ఏ పని చేయాలన్నా హ్యాండ్ శానిటైజర్‌ని ఉపయోగించండి లేదా మీ చేతులను సబ్బుతో కడుక్కోండి.


3. రోగికి దగ్గరగా ఉన్నప్పుడు మీ నోటిని మాస్క్‌తో పాటు చేతులను డిస్పోజబుల్ గ్లోవ్స్‌ను వాడండి.


4. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రపరచడానికి క్రిమిసంహారకాలను ఉపయోగించండి.


చేయకూడనివి:

1. మంకీపాక్స్ కోసం పాజిటివ్ పరీక్షలు చేసిన వ్యక్తులతో పరుపులు, టవల్స్ ఇతర వాటిని పంచుకోకండి.


2. వ్యాధి సోకిన వ్యక్తుల దుస్తులు ఉతకవద్దు.


3. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయనే అనుమానం ఏకాస్త అనిపించినా కూడా పబ్లిక్ లోకి ఫంక్షన్స్ కు వెళ్లకపోవడం మంచిది.


4. వైరస్ సోకిన వ్యక్తులను., అనుమానిత రోగులను దూరం పెట్టకండి. అలాగే, ఈ వ్యాధి విషయంలో ఎలాంటి పుకార్లను నమ్మవద్దు.


Updated Date - 2022-08-03T18:04:22+05:30 IST