Vijayawadaలో Monkeypox కలకలం...
ABN , First Publish Date - 2022-07-17T20:58:35+05:30 IST
విజయవాడ (Vijayawada): నగరంలో మంకీపాక్స్ (Monkeypox) కలకలం రేపుతోంది.
విజయవాడ (Vijayawada): నగరంలో మంకీపాక్స్ (Monkeypox) కలకలం రేపుతోంది. దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారికి మంకీ పాక్స్ సోకినట్లు వైద్యులు (Doctors) అనుమానిస్తున్నారు. చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో ఆ కుటుంబాన్ని ఐసోలేషన్ (Isolation)లో ఉంచి.. వైద్య సేవలు అందిస్తున్నారు. పుణె ల్యాబ్ (Pune Lab)కు చిన్నారి శాంపిల్స్ (samples) పంపించారు.
అయితే మంకీపాక్స్ లక్షణాలు ఉన్నా.. ఇంకా నిర్ధారణ కాలేదని వైద్యులు తెలిపారు. చిన్నారితోపాటు కుటుంబసభ్యులకు చెందిన నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు డాక్టర్లు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని, అంతవరకు గోప్యంగా ఉంచుతున్నామని అన్నారు. సోమవారం సాయంత్రానికి నివేదిక వచ్చే అవకాశం ఉందని, ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.