‘మంకీ ఫీవర్‌’పై ఆందోళన వద్దు

ABN , First Publish Date - 2022-05-25T13:53:48+05:30 IST

మంకీ ఫీవర్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్శశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. కన్నియాకుమారి జిల్లాలో మంగళవారం పలు

‘మంకీ ఫీవర్‌’పై ఆందోళన వద్దు

                  - మంత్రి సుబ్రమణ్యం


పెరంబూర్‌(చెన్నై): మంకీ ఫీవర్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్శశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. కన్నియాకుమారి జిల్లాలో మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం పలు దేశాల్లో మంకీ ఫీవర్‌ కేసులు నమోదవుతున్నాయని, కానీ అది అంటు వ్యాధి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని గుర్తు చేశారు. ఆ వ్యాధి ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే, మంకీ ఫీవర్‌ లక్షణాలు కనిపించిన వారి రక్తం తదితరాలను సత్వరం పునేలోని ల్యాబ్‌కు పంపడంతో పాటు వారికి ప్రత్యేకంగా ఉంచి, చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేసినట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2022-05-25T13:53:48+05:30 IST