అప్పుడే పుట్టిన కోతి ముఖంపై భలే సింబల్.. చూస్తే షాకవ్వాల్సిందే..!

ABN , First Publish Date - 2022-04-25T03:29:35+05:30 IST

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల ఓ జూలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. స్పైడర్ మంకీ జాతికి చెందిన ఓ కోతి ఇటీవల ప్రసవించింది. అయితే..

అప్పుడే పుట్టిన కోతి ముఖంపై భలే సింబల్.. చూస్తే షాకవ్వాల్సిందే..!

ఎన్నారై డెస్క్: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల ఓ జూలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. స్పైడర్ మంకీ జాతికి చెందిన ఓ కోతి ఇటీవల ప్రసవించింది. అయితే.. పిల్ల కోతిని చూసిన జూ అధికారులు ఒక్కసారిగా షాకైపోయారు. కారణం.. దాని ముఖంపై బ్యాట్‌మ్యాన్ సినిమాలోని గబ్బిలం సింబల్ లాంటి చిహ్నం ఉండటమే!  దీంతో.. వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ గుర్తు.. రెక్కలు చాచిన గబ్బిలంలాగా ఉంటుంది. దీంతో.. పిల్లకోతికి సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బ్రెవార్డ్ జూలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మరీ.. పిల్ల కోతి ఫొటోపై మీరు ఓ మారు లుక్కేయండి. 

Updated Date - 2022-04-25T03:29:35+05:30 IST