నకిలీ

ABN , First Publish Date - 2020-05-23T10:22:59+05:30 IST

ఈ యేడు వానాకాలానికి ముందే నకిలీ విత్తనాల బాగోతం బయట పడడంతో అన్నదాతల్లో మళ్లీ గుబులు మొదలైంది. రైతుల

నకిలీ

జిల్లాలో ఉద్దెర పేరిట నకిలీ విత్తనాల విక్రయాలు 

క్షేత్ర స్థాయిలో కొరవడుతున్న అధికారుల పర్యవేక్షణ  

వానాకాలం దగ్గర పడడంతో మళ్లీ మొదలైన దళారీదందా 


ఆదిలాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): ఈ యేడు వానాకాలానికి ముందే నకిలీ విత్తనాల బాగోతం బయట పడడంతో అన్నదాతల్లో మళ్లీ గుబులు మొదలైంది. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసు కుంటున్న ఫర్టిలైజర్‌ వ్యాపారులు మాయాజాలం చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. గ్రామా ల్లో కొందరు దళారులు బడా ఫర్టిలైజర్‌ యజ మానులతో సంబంధాలు పెట్టుకొని అక్రమ విక్ర యాలు జరుపుతున్నారు. ఈయేడు జిల్లాలో 2లక్షల 30వేల హెక్టార్ల సాగు విస్తీర్ణం కాగా లక్షా 44వేల హెక్టార్లలో పత్తి పంట సాగవుతోందని అధికారులు అంచనా వేశారు.


ఏటా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద పెట్టుబడి సహాయాన్ని అంది స్తున్నా అక్కరకు రాక పోవడంతో  రైతులు ఉద్దెరపై ఎరువులు, విత్తనాలు, ఫెస్టిసైడ్‌ మందులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో వ్యాపారులు ఇచ్చిన విత్తనాలనే రైతులు తీసుకెళ్తున్నారు. తీరా అవి నకిలీ విత్తనాలని తేలడంతో లబోదిబోమంటున్నారు. జిల్లాలో 300  వరకు ఫర్టిలైజర్‌ దుకాణాలు ఉన్నప్పటికి అనాధికా రికంగా మరెన్నో దుకాణాలు ఉన్నట్లు సమాచారం. అయితే క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. నిబంధనలు పాటించని దుకాణాల నుంచి కొందరు అధికారులు నెలవారీ మామూళ్లకు ఆశపడుతున్నట్లు తెలుస్తోంది.


ఏటా జిల్లాలో నకిలీ బీటీ-3 విత్తనాలు పట్టుబడుతున్నా నామమా త్రంగానే చర్యలు తీసుకోవడంతో ఈ దందా కట్టడి కావడం లేదు. తాజాగా సిరికొండ మండలంతో పాటు జిల్లా కేంద్రంలోని ఓ విత్తన దుకాణంలో నకిలీ విత్తనాల గుట్టురట్టయింది. వీరిపై ఏదో కేసు లు మోపడం, ఆ తర్వాత మామూలుగానే మారి పోతోంది.  అయితే గత రెండు నెలలుగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా జిల్లాకు ఏ విధంగా నకిలీ విత్తనా లు సరఫరా అయ్యాయో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు.


చక్రం తిప్పుతున్న వ్యాపారులు..

రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసు కొని కొందరు వ్యాపారులు విత్తన, ఎరు వుల అమ్మకాల్లో చక్రం తిప్పుతు న్నారు. వానాకాలం సీజన్‌ మొద లుకాక ముందే ఆర్థిక పరపతి తో సంబంధిత అధికారులను తమదారికి తెచ్చుకుంటున్నా రన్న విమర్శలు లేక పోలే దు. అనుకోకుండా నకిలీ విత్తనాలు పట్టుబడిన నామమాత్రమైన కేసులను  నమోదు చేస్తూ వదిలేస్తు న్నారనే విమర్శ లు వస్తున్నాయి. నగదుకు ఒక రేటు, ఉద్దెరకు మరో రేటుతో విత్తనాలు, ఎరువులను విక్రయిస్తు న్నారు. ఏదో గత్యంతరం లేక ఉద్దెరపై కొనుగోలు చేయడంతో నిలువు దోపిడీ చేస్తున్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత పదింతలు చేసి వసూలు చేస్తున్నారు. సమయానికి చెల్లించకుంటే బెదిరింపు లకు గురిచేయడం పరిపాటిగా మారిపోతోంది. 


అధిక దిగుబడుల పేరిట అంటగడుతున్నారు..

నిషేధిత బీటీ-3 విత్తనాలను విత్తడంతో అధిక దిగుబడులు వస్తాయని నమ్మ బలుకుతూ నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోకి చేరిన నకిలీ విత్తనాల నిల్వలను  అదు ను చూసి అమ్మేసుకుంటున్నారు. అలాగే లూజు విత్తనాలపై రైతులు కూడా ఆసక్తి చూపడం వ్యాపారులకు కలిసి వస్తోంది. గ్రామాల వారీగా ప్రతినిధులను నియమించుకొని కమీషన్‌ పద్ధతిలో విక్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కొరతను సృష్టించి అనుకున్నంత రేటుకు అమ్మేస్తున్నారు.  జిల్లాలో బీటీ-3 విత్తనాలపై రైతులకు మోజు పెరగడం కూడా ఒక కారణంగానే మారుతోంది.  నకిలీ విత్తనాలను అమ్మిన ఫర్టిలైజర్‌ దుకాణం యజమానుల లైసెన్సులను రద్దు చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని చెబుతున్నా వ్యవ సాయ శాఖ అధికారుల మాటలు ఆచరణ సాధ్యం కావడం లేదు. 


మొదలైన దళారీ దందా..

గ్రామాల్లో ఆర్థిక స్థోమత, మంచి పలుకు బడి ఉన్న కొందరు దళారులు ఏటా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను ఉద్దెరపై విక్రయిస్తూ దండుకోవడం  రివా జుగా మారుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ మం డలాలైన బోథ్‌, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, బజార్‌హత్నూర్‌, నేరడిగొండ, బేల మండలా ల్లో ఎక్కువగా ఈ దళారి దందా నడుస్తోంది.  ఎలాంటి రసీదులు ఇవ్వకుండానే విక్రయాలు జరుపుతున్నారు. ఏదైనా తేడా వస్తే తమకేమి తెలియదంటూ చేతులెత్తేస్తున్నారు. తెలివిగా పాత బకాయిలు తీర్చితేనే తిరిగి ఉద్దెరపై ఎరువులు, విత్తనాలను అందజేస్తున్నారు.


టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశాం..ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేం దుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నాం. జిల్లాకు ఉన్న మహారాష్ట్ర సరిహద్దులపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాం.

Updated Date - 2020-05-23T10:22:59+05:30 IST