Jun 18 2021 @ 07:43AM

స్పార్క్ ఓటీటీలో 'మనిషి'

సింగర్, నటుడు, బిగ్ బాస్ ఫేమ్ నోయల్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'మనిషి'(MoneyShe). వినోద్ నాగుల దర్శకత్వం వహించిన ఇందులో పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటిచింది. స్పార్క్ ఓటీటీలో శుక్రవారం (జూన్ 18) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 'మనీ' 'షి' అంటూ డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్.. ఫస్ట్ లుక్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే రాహుల్ సిప్లిగంజ్ పాడినన 'జాను' వీడియో సాంగ్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి బయ్యవరపు రవి కథ - స్క్రీన్ ప్లే అందించారు. సత్యనారాయణ నాగుల ఈ చిత్రాన్ని నిర్మించారు. వినోద్ యాజమాన్య సంగీతమందించారు. స్పార్క్ ఓటీటీలో ఇటీవల విడుదలైన 'డి కంపెనీ', 'క్యాబ్ స్టోరీస్', 'ఫియర్'.. సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన 'మనిషి' ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.