మనీ తస్కరణ మెయిల్స్‌ మళ్ళీ ప్రత్యక్షం!

ABN , First Publish Date - 2022-06-18T09:25:31+05:30 IST

వ్యక్తుల ఫైనాన్షియల్‌ డేటాని తస్కరించే జీమెయిల్‌ స్కామ్‌ మళ్ళీ దర్శనమిస్తోంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ఈ మార్గంలో యూనిక్‌ పద్ధతులను అవలంభిస్తుండటం గమనార్హం.

మనీ తస్కరణ మెయిల్స్‌ మళ్ళీ ప్రత్యక్షం!

వ్యక్తుల ఫైనాన్షియల్‌ డేటాని తస్కరించే జీమెయిల్‌ స్కామ్‌ మళ్ళీ దర్శనమిస్తోంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ఈ మార్గంలో యూనిక్‌ పద్ధతులను అవలంభిస్తుండటం గమనార్హం. గత ఏడాది సెకండ్‌ వేవ్‌ సమయంలో ఈ స్కామ్‌ బైటపడింది. తప్పుదోవ పట్టించే మెసేజ్‌లతో సెన్సిసిటివ్‌ సమాచారాన్ని సంగ్రహించడం ఈ పద్ధతిలోని ప్రత్యేకత.  డీహెచ్‌ఎల్‌ సర్వీస్‌ ఏజెంట్ల ద్వారా చిన్నపాటి పేమెంట్లకు ఈమెయిల్‌ లేదంటే జీమెయిల్‌తో కన్ఫర్మేషన్‌ అడగడం ద్వారా సాగుతోందని భావిస్తున్నారు. అసలీ స్కామ్‌ను గుర్తించడం అంత సులువు ఏమీ కాదు. అయితే కొన్ని చర్యలతో ఎవరైనా తమకు తాము రక్షించుకోవచ్చు. అదెలాగంటే...

ఇలాంటి మెయిల్‌ రాగానే యూఆర్‌ఎల్‌ లింక్‌ను ముందు చెక్‌ చేయాలి. డిహెచ్‌ఎల్‌కు బదులు ఈ లింక్‌లో బీహెచ్‌ఎల్‌ అని ఉంటుంది. 

వెబ్‌సైట్‌లోకి వెళ్ళే ముందే స్పెల్లింగ్‌ను చెక్‌ చేయాలి. వెబ్‌సైట్‌ యూపీఎస్‌ ట్రక్‌ పిక్చర్‌ ఉంటుంది. ప్రత్యర్థి కంపెనీ మాదిరిగా డీహెచ్‌ఎల్‌ ఎన్నడూ అలా పోస్ట్‌ చేయదు. 

ఏ డెలివరీ సర్వీస్‌ కూడా అడ్మిన్‌స్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని అడగదు. అలా అడిగిన పక్షంలో స్కామ్‌ అని గుర్తించి అస్సలు పేమెంట్‌ చేయవద్దు.

ఆర్డర్లన్నింటినీ ట్రాక్‌ చేయడమే కాకుండా ఇలాంటి మెయిల్స్‌ ఉన్నాయా అన్నది నిర్ధారించుకోవాలి. తద్వారా స్కామ్‌లకు గురికాకుండా బైటపడాలి. 

Updated Date - 2022-06-18T09:25:31+05:30 IST