మహనీయుల స్మృతులు: ‘అవసరమెంతో అంతే డబ్బు ఖర్చు చేయాలి’

ABN , First Publish Date - 2022-05-22T17:32:18+05:30 IST

నాటి రోజుల్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతి...

మహనీయుల స్మృతులు: ‘అవసరమెంతో అంతే డబ్బు ఖర్చు చేయాలి’

నాటి రోజుల్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతి అయిన తొలినాళ్లలో బీహార్‌లో అధికారిక పర్యటన చేశారు. పర్యటన మధ్యలో తన బూట్లు పాతవి అయిపోయాయని, తన పాదాలకు ఇబ్బందిగా మారాయని గ్రహించారు. డాక్టర్ ప్రసాద్ తన సెక్రటరీని పిలిచి, తనకు కొత్త షూస్ తీసుకు రావాలని పురమాయించారు. రాష్ట్రపతికి షూస్ తీసుకువచ్చేందుకు సెక్రటరీ వెళ్ళాడు. అయితే సెక్రటరీ చాలా ఖరీదైన బూట్లు కొనుగోలు చేసి తెచ్చాడు. ఈ సాఫ్ట్ షూస్ వేసుకున్నాక రాష్ట్రపతి దాని ధర కూడా అడగరని సెక్రటరీ అనుకున్నాడు. అయితే అక్కడ వేరే విధంగా జరిగింది. మెత్తని బూట్లను చూసిన డాక్టర్ ప్రసాద్, 'నేను ఎప్పుడూ గట్టి బూట్లు వేసుకుంటానని నీకు తెలుసు. వీటి ద్వారా నా ప్రవర్తనను చక్కగా ఉంచుకోవాలని అనుకుంటాను. ఇక రెండవ విషయం ఏమిటంటే, దాని ధర నా సామర్థ్యానికి మించి ఉంది. ఇంత ఖరీదైన బూట్లు ఎందుకు తెచ్చావు? వాటిని తిరిగి ఇచ్చేసి, నాకు అనువైన బూట్లు తీసుకు రమ్మని పంపించారు.


సెక్రటరీ బయటకు బయలుదేరగానే డాక్టర్ ప్రసాద్ అతనిని పిలిచి 'ఇప్పుడే వెళుతున్నావా?' అని అడిగారు. సెక్రటరీ 'అవును, ఇప్పుడే బయలుదేరుతున్నాను' అన్నాడు. డాక్టర్ ప్రసాద్, 'అలా అయితే ఇప్పుడే వెళ్లకు.. ఇప్పుడు మీరు మళ్ళీ ప్రభుత్వ కారులో వెళతారు. దానికి పెట్రోలు ఖర్చు అవుతుంది. మేము మా పర్యటన ముగించుకుని ఇక్కడి నుండి బయలుదేరినప్పుడు, ఈ బూట్లు మార్చుకుంటాం. అని అన్నారు. ఈ మాట విన్న సెక్రటరీ.. ఒక పెద్ద అధికారి డబ్బు ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తారో గ్రహించారు. ఈ విధంగా ఉంటేనే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని సెక్రటకీ అర్థం చేసుకున్నాడు. 

Updated Date - 2022-05-22T17:32:18+05:30 IST