డబ్బుంటేనే..ఆటలు

ABN , First Publish Date - 2022-05-20T05:36:22+05:30 IST

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు ధన దాహం పట్టుకున్నది.

డబ్బుంటేనే..ఆటలు

 క్రీడాకారులపై ఫీజుల మోత 

 ఒక్కో క్రీడకు ఒక్కో రేటు 

 డబ్బులు చెల్లించలేక  నలిగిపోతున్న పేద క్రీడాకారులు 

 శాప్‌పై వెటరన్‌ క్రీడాకారుల అసంతృప్తి

ఏలూరు స్పోర్ట్స్‌, మే 19 : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు ధన దాహం పట్టుకున్నది. రుసుముల పేరుతో పేద క్రీడాకారుల నుంచి  డబ్బులు వసూలు చేస్తోంది. క్రీడకు ఇంత అని రేటు నిర్ణ యించింది. ఇటీవల శాప్‌ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడలకు ఒక్కో క్రీడకు జూనియర్స్‌, సీనియర్స్‌ ప్రాతిపధికన అత్యల్పంగా రూ.300, అత్యధిక ంగా మూడు వేలు చెల్లించాలని మొత్తం 19 రకాల క్రీడలకు డబ్బులు వసూలు చేయా లని ఆదేశాలు జారీ చేసింది. శాప్‌ క్రీడలను ప్రోత్సహించి వాటిని అభివృ ద్ధి చేయాల్సిన ప్రభుత్వం క్రీడలు ఆడితే డబ్బు చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడం దారుణమని పలువురు వెటరన్‌ క్రీడాకారులు వాపోతున్నా రు. నిజానికి ప్రభుత్వం నిర్వహిం చేది కొన్ని క్రీడలు అయితే అసోసి యేషన్‌లు నిర్వహించేవి ఎక్కువ క్రీడలు ఉన్నాయి. కేవలం ప్రభుత్వం నిర్వహించే క్రీడలకు మాత్రమే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అసోసియేషన్లు నిర్వహించే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు అసోసియేషన్లు డొనేషన్ల ద్వారా నిధులు సేకరించి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసోసియే షన్ల మాదిరిగా క్రీడలకు స్పాన్సర్ల ద్వారా డబ్బులు సేకరించి జిల్లాకు, రాష్ట్రస్థాయి పోటీలకు డబ్బులు చెల్లించా లని వాటికి శ్లాబులు నిర్ణయించి ఆర్డర్లు జారీ చేసింది. శాప్‌ నిర్ణయాన్ని క్రీడా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇలా ఫీజులు వసూలు చేస్తే పేద క్రీడా కారులు క్రీడలకు దూరమయ్యే పరి స్థితి నెలకొంటుందని, అది అన్యా యమని వాపోతున్నారు. 

కోచ్‌లపై ఒత్తిడి

క్రీడా మైదానంలో వివిధ క్రీడలకు శిక్షణ అందిస్తున్న కోచ్‌లపై క్రీడా కారుల సంఖ్య పెంచాలని ఒత్తిడి తెస్తున్నారు. డీఎస్‌ఏలో శాప్‌ క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేసి పే అండ్‌ ప్లే విధానంలో వసూలు చేసే రుసుము మొత్తం శాప్‌ అకౌంట్‌కు జమ అయ్యేలా ఏర్పాటు చేశారు. ఫీజుల వసూళ్ళు తక్కువ ఉంటే సంబంధిత కోచ్‌లకు మెమోలు ఇస్తున్నారు. కోచ్‌లు ఇచ్చే శిక్షణకు మెరుగైన ఫలితాలు లేకపోతే మెమోలు ఇవ్వాలి. కానీ ఫీజులు వసూలు తక్కువగా ఉందని, క్రీడాకారుల సంఖ్య పెంచలేదని మెమోలు ఇవ్వడం పై కోచ్‌లు తల పట్టుకుంటున్నారు. ఏది ఏమైనా శాప్‌ తీరుపై క్రీడా సంఘాల్లోనూ, ఇటు కోచ్‌లలోనూ నిరసన వ్యక్తమవుతోంది. 


Updated Date - 2022-05-20T05:36:22+05:30 IST