గూగుల్‌పే, పేటీఎంతోనూ ఏటీఎం నుంచి మనీ!

ABN , First Publish Date - 2022-05-21T07:02:20+05:30 IST

గూగుల్‌పే, పేటీఎం యాప్స్‌తోనూ ఏటీఎంల నుంచి నగదుపొందే సౌలభ్యం సమకూరుతోంది. ఇంతవరకూ డెబిట్‌ కార్డులతోనే ఏటీఎంల నుంచి నగదును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.

గూగుల్‌పే, పేటీఎంతోనూ ఏటీఎం నుంచి మనీ!

గూగుల్‌పే, పేటీఎం యాప్స్‌తోనూ ఏటీఎంల నుంచి నగదుపొందే సౌలభ్యం సమకూరుతోంది. ఇంతవరకూ డెబిట్‌ కార్డులతోనే ఏటీఎంల నుంచి నగదును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఆ రెండు యాప్‌లతోనూ నగదు పొందవచ్చని ఎన్‌ఆర్‌సీ కార్పొరేషన్‌ వెల్లడించింది. అంతేకాదు, అందుకు అనుగుణంగా ఏటీఎంలను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఇందుకోసం దేశంలో మొదటిసారి ఇంటరోపెరబుల్‌ కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయిల్‌(ఐసీసీడబ్ల్యూ) సొల్యూషన్‌ సహకారాన్ని తీసుకుంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి నగదు పొందవచ్చు. ఇంట్లో కార్డు మర్చిపోయినప్పుడు ఇది అక్కరకు వస్తుందని ప్రత్యేకించి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. దీని కోసం మొదటగా...


యూపీఐ సర్వీస్‌ కలిగిన ఏటీఎం మెషీన్‌ చాలా అవసరం. యూపీఐ ఆధారిత పేమెంట్‌ యాప్‌ అంటే జీపే, ఫోన్‌పే, అమెజాన్‌పే, పేటీఎం వంటివి మన మొబైల్‌లో ఉండాలి. వర్కింగ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కూడా ముఖ్యమే. 


ముందు ఏటీఎం వద్దకు వెళ్ళి విత్‌డ్రా ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. 

తదుపరి ఏటీఎం మెషీన్‌ స్ర్కీన్‌పై యూపీఐ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. 

ఎటీఎం స్ర్కీన్‌పై క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది.

ఇప్పుడు ఫోన్‌లో ఉన్న యూపీఐ ఆధారిత పేమెంట్‌ యాప్‌ను క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌పైకి టర్న్‌ చేయాలి.

కోడ్‌ స్కాన్‌ కాగానే అమౌంట్‌ డ్రా చేసుకోవాలి. అయిదు వేల రూపాయలను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇప్పటికి ఉన్న పరిమితి అది.

హిట్‌ చేసి ప్రొసీడ్‌ కావాలి. యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేసి, నగదు పొందవచ్చు. 

Updated Date - 2022-05-21T07:02:20+05:30 IST