రాఖీ పండుగ కోసం మోండలెజ్ ఇండియా ప్రత్యేక చాకొలెట్ బాక్సులు

ABN , First Publish Date - 2020-08-02T00:31:58+05:30 IST

క్యాడ్‌బరీ, పర్క్, హాల్స్, ఓరియో తదితర ప్రముఖ చాకొలెట్, స్నాక్స్ బ్రాండ్ల తయారీ సంస్థ మోండలెజ్ ఈ రాఖీ పండుగ కోసం

రాఖీ పండుగ కోసం మోండలెజ్ ఇండియా ప్రత్యేక చాకొలెట్ బాక్సులు

శ్రీసిటీ: క్యాడ్‌బరీ, పర్క్, హాల్స్, ఓరియో తదితర ప్రముఖ చాకొలెట్, స్నాక్స్ బ్రాండ్ల తయారీ సంస్థ మోండలెజ్ ఈ రాఖీ పండుగ కోసం ప్రత్యేకంగా కొన్ని స్వీట్ ప్యాకేజీలను విడుదల చేసింది. దీనిపై సోషల్ మీడియాలో #CloserThisRakhi పేరుతో ఓ క్యాంపెయిన్ నడుపుతోంది. అలాగే రాఖీ పండుగ కోసం ఆన్‌లైన్‌లో ప్రత్యేకంగా చాకొలెట్ గిఫ్ట్ బాక్సులను ప్రజలకు అందుబాటులో ఉంచనుంది.


రాఖీ పండుగ సమయంలో తోబుట్టువుల జీవితాల్లో మరింత ఆనందాన్ని పంచడమే తమ ఉద్దేశ్యమని మోండలెజ్ ఇండియా కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథన్ చెప్పారు. క్యాడ్‌బరీ వంటి ప్రముఖ బ్రాండ్లను తయారుచేస్తున్న మోండలెజ్.. తరతరాలుగా పండుగల సమయంలో ప్రజల్లో సంతోషాలు పంచుతూనే ఉందని అనిల్ తెలిపారు. ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన క్లోజర్ దిస్ రాఖీ క్యాంపెయిన్‌తో కూడా తాము ప్రేమించే కుటుంబంతో బంధాలను బలపరచుకోవాలనే సందేశాన్ని సంస్థ ఇస్తోందన్నారు.

Updated Date - 2020-08-02T00:31:58+05:30 IST