Abn logo
Aug 4 2021 @ 00:09AM

ఊపందుకున్న మొక్కల విక్రయాలు

పూల మొక్కలను కొనుగోలు చేస్తున్న వినియోగదారులు

పాణ్యం, ఆగస్టు 3: పాణ్యం నర్సరీలలో మొక్కల విక్రయాలు ఊపందుకున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పండ్లు, పూల మొక్కల కోసం ఉద్యాన రైతులు పాణ్యం నర్సరీలకు చేరుకుంటున్నారు. మండలంలో దాదాపు 50 ఎకరాలలో నర్సరీలు సాగవుతున్నాయి. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతోపాటు ఇతర ప్రాంతాలకు వాహనాల రాక పోకల సౌకర్యం మెరుగుపడడంతో మొక్కల రవాణాకు అడ్డు తొలగింది. జాతీయ రహదారి వెంట ఉన్న నర్సరీలలోని గులాబీ, క్రోటన్స్‌ మొక్కల కోసం మహిళలు పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. గులాబీ, చామంతి పూల మొక్కలతోపాటు ప్రభుత్వం సబ్సిడీ కింద ఉద్యానవన శాఖ అంది స్తున్న మామిడి, జామ, చీని, నిమ్మ, దానిమ్మ, అరటి వంటి మొక్కలను రైతులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే మల్లె, గులాబీ, కనకాంబరం వంటి పూల సాగు రైతులు ఇతర జిల్లాల నుంచి పాణ్యం నర్సరీల వద్దకు చేరుకుని మొక్కలను కొనుగోలు చేసి తమ ప్రాంతాలకు తరలిస్తున్నారు.