మూడు నెలల గర్భిణి మళ్లీ ప్రెగ్నెంట్... ఒకేసారి డెలివరీ...

ABN , First Publish Date - 2021-04-10T12:44:28+05:30 IST

మూడు నెలల గర్భిణి మళ్లీ ప్రెగ్నెంట్... ఒకేసారి డెలివరీ...

మూడు నెలల గర్భిణి మళ్లీ ప్రెగ్నెంట్... ఒకేసారి డెలివరీ...

వాషింగ్టన్: ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు. నమ్మశక్యం కూడా కాకపోవచ్చు. అప్పటికీ గర్భంతో ఉన్న ఒక మహిళ మరోమారు గర్భం ధరించి, కవలలకు జన్మనిచ్చింది. ఈ కవలలు జన్మించిన సమయం ఒకటే అయినప్పటికీ... వారు కన్సీవింగ్ అయిన సమయం వేర్వేరుగా ఉండటం విచిత్రం. ఆమె మొదటిసారి గర్భం ధరించిన మూడు వారాల తరువాత రెండవమారు కన్సీవ్ అయ్యింది. రెబెకా రాబర్ట్ ఆమె భర్త రైస్ వీవర్‌లు చాలాకాలంగా పిల్లల కోసం పరితపించిపోయారు. 


గతఏడాది ఒక ఫెర్టిలిటీ మెడికేషన్ తరువాత తల్లిదండ్రులు కాబోతున్నారని వీరికి డాక్టర్ చెప్పినప్పుడు వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే వీరి ఆనందం రెండింతలవబోతోందని ఊహించలేకపోయారు. రెబెకాకు మూడో అల్ట్రాసౌండ్ తీయించాక మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నావని డాక్టర్ చెప్పినప్పుడు ఆమె నమ్మలేకపోయింది. అప్పటికే ఆమె గర్భంలో 12 వారాల పిండం ఎదుగుతుండటంతో ఆమె ఈ వార్తతో కంగారుపడిపోయింది. రెబెకా సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ చేస్తూ దానిలో.... ‘గుడ్ మార్నింగ్ అమెరికా... నిజానికి ఇది ఎంతో ఆశ్చర్యపరిచే విషయం. నా కడుపులో పెరిగిన ఇద్దరు శిశువుల మధ్య మూడు వారాల అంతరం ఉంది. ఇది డాక్టర్లకు సైతం ఆశ్చర్యం కలిగించింది’ అని తెలిపారు.

Updated Date - 2021-04-10T12:44:28+05:30 IST