రామాయపల్లెలో మొలకలపున్నమి వేడుకలు

ABN , First Publish Date - 2022-05-17T05:10:35+05:30 IST

పోరుమామిళ్ల పంచాయతీ పరిధిలోని రామాయపల్లె గ్రామంలో మొలకలపున్నమి వేడుకలు గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు.

రామాయపల్లెలో మొలకలపున్నమి వేడుకలు
రామాయపల్లెలో మొలకలపున్నమి వేడుకల్లో పాల్గొన్న గ్రామస్థులు

పోరుమామిళ్ల, మే 16 : పోరుమామిళ్ల పంచాయతీ పరిధిలోని రామాయపల్లె గ్రామంలో మొలకలపున్నమి వేడుకలు గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవాలని చెరువులు, కుంటలు నిండాలని రైతులు బాగుండాలని కోరుతూ మొలకలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని చిన్నారులు, మహిళలు మొలకలను ఎత్తుకొని గ్రామం మొత్తం తిరిగారు.  


Updated Date - 2022-05-17T05:10:35+05:30 IST