మోక్షగుండం టెర్మినల్‌ నుంచి కదిలిన తొలి రైలు

ABN , First Publish Date - 2022-06-08T16:56:01+05:30 IST

బయ్యప్పనహళ్లి రైల్వేస్టేషన్‌ పరిధిలోని తొలి ఏసీ రైల్వేస్టేషన్‌ అయిన సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే టెర్మినల్‌ నుంచి రైళ్ల సంచారం

మోక్షగుండం టెర్మినల్‌ నుంచి కదిలిన తొలి రైలు

బెంగళూరు, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): బయ్యప్పనహళ్లి రైల్వేస్టేషన్‌ పరిధిలోని తొలి ఏసీ రైల్వేస్టేషన్‌ అయిన సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే టెర్మినల్‌ నుంచి రైళ్ల సంచారం లాంఛనంగా ప్రారంభమైంది. బాణసవాడి - ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ సోమవారం రాత్రి 7.55 గంటలకు బయల్దేరిన తొలిరైలుగా రికార్డు పుటల్లోకెక్కింది. తొలిదశలో ఈ టెర్మినల్‌ నుంచి తిరువనంతపురం, పాట్నాకు కూడా వారంలో మూడుసార్లు రైళ్ల సంచారం అందుబాటులోకి రానుంది. ఈ టెర్మినల్‌ నుంచి మరో రెండు నెలల్లో మొత్తం 50 రైళ్లను నడపాలని నైరుతి రైల్వేజోన్‌కు చెందిన బెంగళూరు డివిజన్‌ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2022-06-08T16:56:01+05:30 IST