మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2020-12-05T04:09:40+05:30 IST

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వం శీకృష్ణ డిమాండ్‌ చేశారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీ కృష్ణ

 డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీ కృష్ణ

కల్వకుర్తి అర్బన్‌, డిసెంబరు 4: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వం శీకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ  అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడా రు. మొక్కజొన్నకు రూ. 2500 మద్దతు ధర పెంచి ఆన్‌లైన్‌తో సం బంధం లేకుండా కొనుగోలు చేయాలన్నారు.  ప్రభుత్వం నియంత్రిక వ్యవయసాయం పేరుతో  పత్తి, సన్నరకం వడ్లను వేయించిందన్నారు.  హమాలీఖర్చు ఒక బ్యాగుకు రూ. 20 అవుతుందని, క్వింటాల్‌కు  ఐదు కేజీల తరుగు తీస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులను ప్రభు త్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. స్పందించకపోతే కలెక్టరే ట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బ్లాక్‌ కాం గ్రెస్‌ అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీని వాస్‌ రెడ్డి, మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి పాల్గొన్నారు.  

యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడికి సన్మానం 

 యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికైన అనిల్‌ కుమార్‌గౌడ్‌ను డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ సన్మానించారు.  

ఇసుక అనుమతుల పేరుతో దోపిడీ


 ఉప్పునుంతల: అనుమతుల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్న అధికారులను వెంటనే సస్పెన్షన్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జి ల్లా అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ  డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండంలోని దుందుబీని  కాంగ్రెస్‌ నాయకులతో కలిసి పరిశీలించారు. దుందుబీ వాగులో అక్రమ  ఇసుక రవాణా చేస్తున్న  ట్రాక్టర్‌ అడ్డుకున్నారు.  తహసీల్దార్‌కు కృష్ణయ్యకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుందన్నారు. దీని వెనుక ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌ ఉన్నారని అరోపించారు. ప్రభుత్వం చేపడుతున్న నిర్మా ణాలకు ఇసుక తరలింపునకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదన్నారు. ఒక ట్రిప్పుకు అనుమతి ఇస్తే పది ట్రిప్పులు తరలిస్తున్నా అధికారులు ఎందుకు పట్టిచుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అధికారులు సహితం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.  ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఈ నెల 7న తహసీల్దార్‌ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించనున్న ట్లు  తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు అనంతాన రెడ్డి, నర్సింహ రావు  ఉన్నారు.  

Updated Date - 2020-12-05T04:09:40+05:30 IST