‘మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలతో కొవిడ్‌ను అధిగమించాలి’

ABN , First Publish Date - 2020-10-02T08:55:28+05:30 IST

మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలతో వినూత్న వ్యాపార నిర్వహణ మార్గాలను అన్వేషిస్తున్న కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితులను చాలా మంది అధిగమించారని ఆదికవి నన్నయ ..

‘మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలతో కొవిడ్‌ను అధిగమించాలి’

దివాన్‌చెరువు, అక్టోబరు 1: మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలతో వినూత్న వ్యాపార నిర్వహణ మార్గాలను అన్వేషిస్తున్న కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితులను చాలా మంది అధిగమించారని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కుల పతి ఆచార్య మొక్కా జగన్నాథరావు పేర్కొన్నారు. కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ విభాగం, ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా విశాఖ పట్నం చాప్టర్‌, ముంబయికి చెందిన వాల్యూ ఐడియాస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రయి వేటు లిమిటెడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం జాతీయ సదస్సు నిర్వ హించారు.


వ్యాపార కార్యకలాపాల నిర్వహణలో నిపుణుల పాత్ర-కొవిడ్‌ 19 సంక్షోఽభంలో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ’ అంశంపై జదస్సు జరిగింది. వాల్యూ ఐడియాస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఎండీ మనీష్‌ బన్సల్‌, రైల్‌ ఆపరేషన్స్‌ బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ కంపెనీ సీనియర్‌ మేనేజర్‌ రాఖేష్‌సోనీ పలు విషయాలను వివరించారు. సదస్సుకు కో-ఆర్డినేటర్లుగా ఆచార్య ఎస్‌.టేకి, ఐసీఎస్‌ఐ విశాఖ పట్నం చాప్టర్‌ చైర్మన్‌ ఎం.సురేష్‌ వ్యవహరించారు. నన్నయ రిజిస్ట్రార్‌ ఆచార్య బట్టు గంగారావు, ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.రమేష్‌, కో-ఆర్డినేటర్లు పి.ఉమామహేశ్వరీదేవి, ఎన్‌.ఉదయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-02T08:55:28+05:30 IST