పిల్లల skin పొడిబారకుండా ఉండాలంటే ఇంట్లోనే ఇవి ట్రై చేయండి!

ABN , First Publish Date - 2022-05-04T17:55:26+05:30 IST

వేసవి ఎండ ప్రభావం చర్మం మీద ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా చిన్నపిల్లలకు ఈ ఇబ్బంది చాలా ఎక్కువ. వారి చర్మం పొడిబారకుండా ఉండడానికి మాయిశ్చరైజ్‌

పిల్లల skin పొడిబారకుండా ఉండాలంటే ఇంట్లోనే ఇవి ట్రై చేయండి!

ఆంధ్రజ్యోతి(04-05-2022)

వేసవి ఎండ ప్రభావం చర్మం మీద ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా చిన్నపిల్లలకు ఈ ఇబ్బంది చాలా ఎక్కువ. వారి చర్మం పొడిబారకుండా ఉండడానికి మాయిశ్చరైజ్‌ చెయ్యాలి. దీని కోసం మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్లకు బదులు... ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇవి సురక్షితం కూడా.


ఇన్‌స్టంట్‌గా: ఒక కప్పు అలొవెరా జెల్‌, నాలుగైదు టీస్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌. రెండు నుంచి మూడు టీస్పూన్ల టీ ట్రీ ఆయిల్‌, రెండు లేదా మూడు టీస్పూన్ల నిమ్మరసం తీసుకోండి. అన్నిటినీ ఒక గిన్నెలో బాగా కలపండి. ఇలా సిద్ధమైన మాయిశ్చరైజర్‌. సున్నితమైన పిల్లల చర్మానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.


పాలతో: అయిదు టీస్పూన్ల పాలు, ఒక టీస్పూన్‌ ఉప్పు తీసుకోండి. పాలను మరిగించాక, ఉప్పు అందులో కలపండి. మిశ్రమం కాస్త చిక్కబడి, పాలు సగానికి తగ్గేదాకా సన్నటి సెగలో ఉంచండి. తరువాత దాన్ని చల్లబరచి సీసాలో వేసుకోండి. పిల్లలకు స్నానం చేయించిన తరువాత ఈ మాయిశ్చరైజర్‌ రాయండి. 


ఆల్మండ్‌ ఆయిల్‌తో: నాలుగు టీస్పూన్ల పెట్రోలియం జెల్లీ, పది టీ స్పూన్ల గ్లిజరిన్‌, రెండు టీస్పూన్ల బాదం నూనె, రెండు టీస్పూన్ల జొన్న పిండి తీసుకోండి. ఒక టీస్పూన్‌ నీటినీ, బాదం నూనెను మరిగించండి. ఒక గిన్నెలో, ఆ మిశ్రమాన్ని పోసి, జొన్నపిండి వెయ్యండి. దాన్ని బాగా కలిపి, గ్లిజరిన్‌ పెట్రోలియం జెల్లీ కలపండి. ఆ మిశ్రమాన్ని చల్లబరచి, సీసాలో వేసుకోండి.

Read more