Abn logo
Sep 14 2021 @ 14:57PM

సాయితేజ్‌ను కాపాడిన వ్యక్తికి కారు గిఫ్ట్.. ఇదీ నిజం!

హైదరాబాద్: బైక్ ప్రమాదానికి గురైన సినీ హీరో సాయిధరమ్ తేజ్‌ను కాపాడిన యువకుడు మహ్మద్ ఫర్హాన్‌ను అందరూ అభినందిస్తున్నారు. ఫర్హాన్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఇదంతా బాగానే ఉన్నా.. ఫర్హాన్‌కు మెగా ఫ్యామిలీ నజరానాలు ఇచ్చిందంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తనకు ఆప్త మిత్రుడైన సాయితేజ్‌ను కాపాడినందుకు ఫర్హాన్‌కు రామ్ చరణ్ ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై ఫర్హాన్ స్పందించాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించాడు. తనకు ఎవరూ ఎలాంటి బహుమతులు, డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశాడు. మెగా ఫ్యామిలీ నుంచి తనకు ఎవరూ ఫోన్ కాల్ చేయలేదని మహ్మద్ ఫర్హాన్ చెప్పాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించానే తప్ప, తాను ఏమీ ఆశించలేదని ఫర్హాన్ తెలిపాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో తన కుటుంబం ఇబ్బందులు పడుతోందని, దయచేసి అలాంటి వార్తలు పోస్ట్ చేయొద్దని కోరాడు.