Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 22 May 2022 14:32:07 IST

Mohanlal : ఆసక్తికరంగా ‘ఎలోన్’ టీజర్

twitter-iconwatsapp-iconfb-icon

కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ (Mohanlal) ఈ ఏడాది వరుసగా ‘బ్రోడాడీ (Bro daddy), ఆరాట్టు (Araattu), 12th మేన్’ (12th Man) చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్నారు. వీటిలో ‘బ్రోడాడీ, 12th మేన్’ చిత్రాలు రెండూ ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. తదుపరిగా మోహన్ లాల్ నటిస్తున్న మరో థ్రిల్లర్ మూవీ ‘ఎలోన్’ (Alone). ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబావూర్ (Antony Perumbavoor) నిర్మాణంలో, షాజీ కైలాస్ (Shaji Kailas) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పంజాబీ బ్యూటీ కృతి ఖర్బందా (Kriti Kharbanda) .. మాలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. గతంలో మోహన్ లాల్, షాజీ కైలాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ఈ నేపథ్యంలో ‘ఎలోన్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న (శనివారం) మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎలోన్’ చిత్రం టీజర్ విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


వైట్ అండ్ వైట్ యోగా కాస్ట్యూమ్స్‌తో మోహన్ లాల్ (Mohanlal) టీజర్‌లో రివీలయ్యారు. ‘ది రియల్ హీరోస్ ఆర్ ఆల్వేస్ ఎలోన్’ (The real heroes are always alone) అనే మోహన్ లాల్ వాయిస్ ఈ టీజర్‌పై మరింతగా అంచనాల్ని పెంచుతోంది.  ఇందులో మోహన్ లాల్ ఒంటరి యోధుడని అర్ధమవుతోంది. ఆసక్తికరమైన కథాకథనాలతో, థ్రిల్లింగ్ సీన్స్ తో ఈ సినిమా అభిమానుల్ని ఆకట్టుకోబోతోంది. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జెక్స్ బిజాయ్ సంగీతం అందిస్తుండగా.. అభినందన్ రామానుజన్ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. మరి ఎలోన్ గా మోహన్ లాల్ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటారో చూడాలి. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International