Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 07 Aug 2022 15:48:39 IST

Mohanlal : తాజా చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం

twitter-iconwatsapp-iconfb-icon

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ (Mohanlal), దర్శకుడు జీతు జోసెఫ్ (Jeethu Joseph) కలకయికలో ఇప్పుడు నాలుగో థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. పేరు ‘రామ్’ (Ram). అభిషేక్ ఫిల్మ్ప్, ప్యాషన్ స్డూడియోస్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మోహన్ లాల్ రామ్మోహన్ అనే  ‘రా’ అధికారిగా నటిస్తున్నారు. అందాల త్రిష (Trisha) ఆయన భార్య డాక్టర్ వినీతగా నటిస్తోంది. ‘హి హేజ్ నో బౌండరీస్’ దీనికి ట్యాగ్ లైన్. నిజానికి ఈ సినిమా 2019లోనే ప్రారంభమైంది. విదేశాల్లో కొంత భాగం షూట్ చేశారు. అయితే ఎందుకనో ఈ సినిమా చిత్రీకరణకు కొంత కాలం బ్రేక్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో జీతు జోసెఫ్ మోహన్ లాల్‌తో ‘ది 12th మేన్’ అనే థ్రిల్లర్ మూవీని తెరకెక్కించడం విడుదల చేయడం కూడా జరిగిపోయాయి. ఇక తాజాగా ‘రామ్’ చిత్రం షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. 

నిజానికి ఈ సినిమాను ముందు ఒకే భాగంగా రూపొందించాలనుకున్నారు. కానీ ఇప్పుడు దీన్ని రెండు భాగాలు చేశారు. మొదటి భాగం లండన్, ప్యారిస్, మాస్కో దేశాల్లో ప్రధానంగా షూటింగ్ జరుపుకోనుంది. ఇటీవల ఈ సినిమా లొకేషన్ హంట్‌ను పూర్తి చేసి.. నిన్న (శనివారం) చిత్రీకరణను ప్రారంభించారు. ఇంద్రజిత్ సుకుమారన్, ఆదిల్ హుస్సేన్, దుర్గ కృష్ణ, సాయికుమార్, సుమన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విష్ణు శ్యామ్ సంగీతం అందిస్తుండగా, సతీష్ కురుప్పు ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. ‘హే జూడ్’ (Hey Jude) అనే మూవీ తర్వాత త్రిష మలయాళంలో నటిస్తున్న రెండో సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో ఆమె డాక్టర్‌గా నటిస్తుండడం విశేషం.

‘దృశ్యం (Drishyam), దృశ్యం 2 (Drishyam 2) , ది 12th మేన్ (The 12th Man)’ సూపర్ హిట్స్ తర్వాత మోహన్ లాల్, జీతు జోసెఫ్ కలయికలో రాబోతున్న ఈ నాలుగో చిత్రంపై అభిమానులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఇప్పటికే మూడేళ్ళ పాటు గ్యాప్ తీసుకున్న ఈ సినిమా షూట్ ఎట్టకేలకు మళ్ళీ ప్రారంభమవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.  మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుందో చూడాలి.   

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement