Apr 21 2021 @ 00:44AM

క్రీడాకారుడి పాత్రలో మోహన్‌లాల్‌?

తన నటనా కౌశలంతో పాత్రకే వన్నెతేగల విలక్షణ నటుడు మోహన్‌లాల్‌. ఈసారి ఆయన క్రీడాకారుడిగా కొత్త తరహాపాత్రలో ప్రేక్షకుల ముందుకురానున్నారని సమాచారం. చారిత్రక కథాంశంతో తెరకెక్కి జాతీయ పురస్కారానికి ఎంపికైన  ‘మరక్కార్‌’ చిత్ర దర్శకుడు ప్రియదర ్శన్‌తో మోహన్‌లాల్‌ ఈ కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడని తెలిసింది. ప్రియదర్శన్‌ కూడా గతంలో మోహన్‌లాల్‌తో స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో ఓ చిత్రం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారునిగా నటించనున్నారు. ఇటీవల అభిమానులు రూపొందించిన ఓ ఫొటోను మోహన్‌లాల్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అందులో ఆయన జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా వెనుక గోడకు ఫుట్‌బాల్‌ ఆడుతున్న క్రీడాకారుడి చిత్రపటం ఉండటం ఈ వార్తలకు ఊతమిచ్చింది. ఇటీవల మలయాళంలో వచ్చిన ‘దృశ్యం 2’ చిత్రంతో సక్సెస్‌ను అందుకున్నారు మోహన్‌లాల్‌. తాజాగా ఆయన హీరోగా నటిస్తూ తొలిసారి దర ్శకత్వం వహిస్తు ‘బారోజ్‌’ను తెరకెక్కిస్తున్నారు.