గొర్ల కాపరులకు క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2021-10-20T04:57:00+05:30 IST

గొర్ల కాపరులకు క్షమాపణ చెప్పాలి

గొర్ల కాపరులకు క్షమాపణ చెప్పాలి
మాట్లాడుతున్న గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నాయకులు

 సినీ నటుడు మోహన్‌బాబుపై ఫిర్యాదులు

నర్సంపేట టౌన్‌, అక్టోబరు 19 : సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్‌బాబు పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరుతూ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగ ళవారం వరంగల్‌ జిల్లా నర్సంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి పరికి మధు కర్‌ మాట్లాడారు. మూవీ ఆర్టిస్టు అసోసి యేషన్‌ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలు పొందిన సందర్భంలో ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో మోహన్‌బాబు గొర్రెల కాపరులను అ వమానపరిచేలా వ్యాఖ్యలు చేశారన్నారు. మా  ఎ న్నికల్లో ఘర్షణలు అందరూ పరిశీలిస్తున్నారని, గొర్రెలు మేపుకునే వాడి దగ్గర కూడా సెల్‌ఫోన్‌లు ఉన్నాయని మాట్లాడడం సరికాదన్నారు.  వెంటనే మోహన్‌బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలిపారు. లేనిచో ఆందో ళనలు చేపడతామని హెచ్చరించారు. సంఘం నాయకులు కుండె లింగస్వామి, జక్కుల మల్లేష్‌, నానబోయిన సుమన్‌, రాజు, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

  నెక్కొండ : గొర్ల  కాపరులను కించపరిచేలా మాట్లాడిన సినీనటుడు మంచు మోహన్‌బాబుపై కేసు నమోదు చేయాలని  కోరుతూ గొర్ల, మేకల పెంపకం దారుల సంఘం నాయకులు మంగళవారం ఎస్సై నాగరాజుకు ఫిర్యాదు చేశారు.  సంఘం జిల్లా  కోశాధికారి  బొడ్డు రవి, సంఘం నాయకులు కంచె ఐలయ్య,  ఉడ్రాతి లెనిన్‌రాజు, బండారి  ఐలయ్య, నవీన్‌, కుమారస్వామి పాల్గొన్నారు. 

  చెన్నారావుపేట: ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుపై చర్యలు తీసుకోవాలని మంగళవారం గొర్రెలు, మేకల పెంపకదారుల సంఘం(జీఎంపీఎస్‌) ఆద్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి  పరికి మధుకర్‌ మాట్లాడారు.  కార్యక్రమంలో గొర్రెల పెంపకందారుల గ్రామ సొసైటీ చైర్మన్‌ కుండె కుమారస్వామి, కుండె రాజ్‌కుమార్‌, వడ్డె రవి, మంగ సదయ్య, చీర కుమారస్వామి, రాజు, తదితరులు పాల్గొన్నారు.  



Updated Date - 2021-10-20T04:57:00+05:30 IST