జమ్ము, ఏప్రిల్ 3: కశ్మీరీ పండిట్లు త్వరలోనే తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తారని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. వారు మళ్లీ నిరాశ్రయులు కాకుండా అనుకూలమైన వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. మూడు రోజుల నర్వే్హ(ఉగాదిలాగా కశ్మీరీ పండిట్లకు కొత్త సంవత్సరం) ముగింపు కార్యక్రమంలో పండిట్లను ఉద్దేశిస్తూ ఆన్లైన్లో ఆయన మాట్లాడారు. పండిట్లను కశ్మీర్ లోయకు తిరి గి పంపాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘‘మీరు (పండిట్లు) ఒక్కసారి లో యకు తిరిగి వెళ్లాక మళ్లీ నిరాశ్రయలు కావడం జరగదు. మిమ్మల్ని ఎవరైనా తరిమేసే ప్రయత్నం చేస్తే వారికి తగిన శాస్తి జరుగుతుంది’’ అని భాగవత్ అన్నారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.