Abn logo
Oct 18 2020 @ 22:24PM

మలయాళ మూవీ రీమేక్‌లో మోహన్‌ బాబు

Kaakateeya

టాలీవుడ్‌లోని స్టార్‌ హీరోలందరూ ఇప్పుడు రీమేక్స్‌పై దృష్టి పెట్టారా? అంటే అవునని చెప్పక తప్పదు. ఎందుకంటే మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పటికే రెండు రీమేక్‌ చిత్రాలను ప్రకటించారు. 'లూసిఫర్‌', 'వేదాళమ్‌' చిత్ర రీమేక్‌లను చిరు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ 'అయ్యప్పన్ కోషియమ్' చిత్రం చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరో స్టార్‌ హీరో, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు కూడా ఓ రీమేక్‌ చిత్రాన్ని చేయబోతోన్నట్లుగా టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తుంది.

మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించడంతో పాటు అవార్డులు పొందిన సైన్స్‌ ఫిక్షన్ కామెడీ డ్రామా 'ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ వెర్షన్ 5.25' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు మోహన్‌ బాబు ఆసక్తిగా ఉన్నారట. ఈ చిత్రాన్ని రతీష్‌ బాలకృష్ణన్ పొదువల్‌ తెరకెక్కించారు. త్వరలోనే ఈ చిత్ర రీమేక్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement